తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో పెండింగ్లో ఉన్న దస్త్రాలు, స్లాట్ బుకింగ్లు, రిజిస్ట్రేషన్లు, సాదా బైనామ, భూ భారతి దరఖాస్తుల గురించి తహసీల్దార్ అమరేంద్ర కృష్ణను అడిగి తెలుసుకున్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.