టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా శ్రీదేవి నియామకం

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా శ్రీదేవి నియామకం

VZM: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా గంట్యాడ శ్రీదేవిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నియమించారు. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. గతంలో ఆమె ఎంపీపీగా పనిచేశారు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.