ఆకుపై సూక్ష్మ కళాకారుడి ప్రదర్శన

ఆకుపై సూక్ష్మ కళాకారుడి ప్రదర్శన

MDCL: అల్వాల్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్ కుమార్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన కళను ప్రదర్శించారు. ఒక ఆకుపై ఉపాధ్యాయుడు, విద్యార్థి చిత్రాలను అద్భుతంగా చిత్రించి ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఇప్పటికే దేశ, రాష్ట్ర నాయకుల చిత్రాలను గీసి ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు.