కొత్తూరులో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కొత్తూరులో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సిద్దిపేట: ములుగు మండలం కొత్తూరు గ్రామంలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శరీర దృఢత్వాన్ని, ఆలోచనా శక్తిని పెంచుతాయని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు.