మంత్రిని కలిసిన ఐసీడీఎస్ పీడీ

కడప: రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సోమవారం రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రక్తహీనత లోపం ఉన్న గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టి సరైన పోషకాహారం అందించాలన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు అనీమియా బారిన పడకుండా ఉండేందుకు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు.