నకిలీ మద్యం కేసు.. విచారణకు మేము సిద్ధం

నకిలీ మద్యం కేసు.. విచారణకు మేము సిద్ధం

అన్నమయ్య: నకిలీ మద్యం కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని తంబళ్లపల్లె మండలం(M) కన్నె మడుగుకు చెందిన రామకృష్ణారెడ్డి, రవిశంకర్ రెడ్డిలు చెప్పారు. కేసులకు భయపడి తాము పారిపోయామని SMలో చేస్తున్న ప్రచారాలు దుష్ప్రచారాలన్నారు. తప్పు చేసిన వారే పరారీలో ఉన్నారని, తాము కన్నెమడుగు గ్రామంలోనే ఉన్నామన్నారు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.