నాడు భర్త సర్పంచ్.. నేడు భార్య ఛైర్మన్..?
NLG: దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి పున్న శైలజ వెంకటేష్ విజయం సాధించారు. 20వ వార్డు నుంచి గెలుపొందిన ఆమె, మున్సిపల్ ఛైర్మన్ పీఠం దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో దేవరకొండ జీపీగా ఉన్నప్పుడు ఆమె భర్త వెంకటేష్ సర్పంచ్‌గా సేవలు అందించగా, ఇప్పుడు మున్సిపాలిటీలో భార్య విజయం సాధించడం విశేషం. ఈ అరుదైన రికార్డుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.