తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిడటంతో శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 86,091 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,348 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.