ఆత్మకూరు ఎస్సై సస్పెండ్
HNK: జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సతీశ్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల్లో నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని CP స్పష్టం చేశారు.