ప్రమాదకరంగా వంతెన రెయిలింగ్

PPM: వీరఘట్టం మండలం అచ్చెపువలస వద్ద ఉన్న తోటపల్లి ఎడమకాలువపై వంతెన ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు వంతెనపై ఉన్న రెయిలింగ్ ఊడిపోతుండగా మరో వైపు వంతెనకు ఒకవైపు గట్టు కోతకు గురైందని స్థానికులు తెలిపారు. తరచూ ఈ వంతెనపై వస్తున్న పశువులు ప్రమాదాల భారిన పడుతున్నాయన్నారు. అధికారులు స్పందించి వంతెన వద్ద కోతకు గురైన చోట మరమ్మతులు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.