కుక్కల దాడిలో లేగ దూడ మృతి
KMR: మద్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఇవాళ వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. హనుమాన్ మందిరానికి చెందిన లేగ దూడ మేత కోసం బయటకు రాగా, కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో అది మృతి చెందింది. గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.