వరద బాధితులకు భోజన ప్యాకెట్లు పంపిణీ

వరద బాధితులకు భోజన ప్యాకెట్లు పంపిణీ

తూ.గో: విజయవాడ వరద బాధితుల సహాయార్థం బిక్కవోలు నుంచి 1500 భోజన ప్యాకెట్లను మంగళవారం పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలతో బిక్కవోలుకు చెందిన కేపీఆర్ క్రాప్ సైన్సెస్ ఇండస్ట్రీ సౌజన్యంతో 1500 భోజన ప్యాకెట్లను తయారుచేసి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు తరలించారు.