'ఒకే ఆరోగ్య' దినోత్సవం వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

'ఒకే ఆరోగ్య' దినోత్సవం వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

కృష్ణా: జిల్లాలో వారం రోజులపాటు ‘ఒకే ఆరోగ్య దినోత్సవం’ అవగాహన వారోత్సవాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల ప్రచారం కోసం రూపొందించిన ప్రచార పోస్టర్‌ను సోమవారం మచిలీపట్నం లోని కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో కలిసి కలెక్టర్ బాలాజీ ఆవిష్కరించారు.