ముంబై నిలిచిన CNG సరఫరా.. వాహనదారుల ఇక్కట్లు

ముంబై నిలిచిన CNG సరఫరా.. వాహనదారుల ఇక్కట్లు

ముంబైలో 2రోజులుగా CNG సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో సరఫరా ఆగిపోయింది. వెంటనే చర్యలు చేపట్టిన పలు కంపెనీలు సోమవారం వరకు కొంతమేర సరఫరా చేశాయి. నేటి సాయంత్రానికి పూర్తి సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పాయి. కాగా నగరంలో 5 లక్షల వరకు CNG వాహనాలు ఉన్నాయి.