హిందూపురం ఏఐవైఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

సత్యసాయి: హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్‌లో ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కమల్ బాషా ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. హిందూపురం ఏఐవైఎఫ్ అధ్యక్షులుగా జిలాన్ భాష, కార్యదర్శిగా నూర్ మహమ్మద్, సహాయ కార్యదర్శిగా పైరోజ్, ఉపాధ్యక్షులుగా జిలాన్ ఖాన్‌లను ఎన్నుకున్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు.