నెల్లిమర్లలో ఫ్యామిలీ యోగా కార్యక్రమం

నెల్లిమర్లలో ఫ్యామిలీ యోగా కార్యక్రమం

VZM: నెల్లిమర్ల మండలంలో యోగాంధ్ర వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఫ్యామిలీ యోగా కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో యోగాసనాలు నిర్వహించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ యోగా చేయాలని ఆయన సూచించారు. యోగా శిక్షకులు పైడిరాజు, విజయభాస్కరరావు మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, వెలుగు సిబ్బంది, విద్యార్ధులు, స్థానికులు పాల్గొన్నారు.