ఖబడ్దార్.. మూల్యం చెల్లించుకుంటారు: జోగి రమేష్
AP: కల్తీ మద్యం కేసులో CM చంద్రబాబు, మంత్రి లోకేష్ ఒత్తిడితో అధికారులు తప్పులు చేస్తున్నారని YCP నేత జోగి రమేష్ ఆరోపించారు. ఏ సంబంధం లేని తనను అరెస్ట్ చేయాలని చూస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. చంద్రబాబు మూడేళ్లే అధికారంలో ఉంటారని, ఆపై సిట్ అధికారులు తనకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. FIRలో ఉన్న జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు.