పైకప్పు పెచ్చులు ఊడిపడి.. విద్యార్థులకు గాయాలు

KRNL: ఆలూరు మండల ప్రాథమిక పాఠశాలలో బుధవారం తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో నిత్య, జయశ్రీ, చరణ్, విఘ్నే అనే నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాఠశాల భవనం నాణ్యత లోపించడం వల్లే పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.