అమ్మకు రాకపోయినా.. ఇంగ్లీష్ నేర్పింది: సీఈవో
ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జ్ యూనియన్‌తో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. 'నాకు మా అమ్మే ఇంగ్లీష్ నేర్పింది. ఆమెకి ఆ భాష రాకపోయినా.. మమ్మల్ని అమెరికాకు పంపించాలన్న సంకల్పంతో మా కోసం నేర్చుకుంది. అదే మాకు నేర్పించింది. అదొక్కటే నేడు నా జీవితానికి, ఎన్విడియాకు నిర్వచనం' అని చెప్పుకొచ్చారు.