వీటీపీఎస్ అధికారులపై మండిపడ్డ గ్రామ ప్రజలు

వీటీపీఎస్ అధికారులపై మండిపడ్డ గ్రామ ప్రజలు

NTR: ఇబ్రహీంపట్నం జూపూడి గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులు వీటీపీఎస్ అధికారులపై మండిపడ్డారు. గురువారం జూపూడి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. వీటీపీఎస్ బూడిద వలన రోగాల పాలవుతున్నామని, వీటీపీఎస్ అధికారులు మాత్రం డబ్బులు తిని బతుకుతున్నారని తెలిపారు. మేము మాత్రం బూడిద తిని రోగాల పాలవుతున్నామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.