సందీప్ కిషన్‌తో ‘శంభాల’ మేకర్స్

సందీప్ కిషన్‌తో ‘శంభాల’ మేకర్స్

ఆది సాయికుమార్ 'శంభాల' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న షైనింగ్ పిక్చర్స్ బ్యానర్, మరోసారి దర్శకుడు యుగంధర్ మునితో మరో ప్రాజెక్టు ప్రారంభించింది. యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం సందీప్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవనుంది.