గుండె పోటుతో రైతు మృతి

గుండె పోటుతో రైతు మృతి

SRD: గుండెపోటుతో ఓ రైతు మృతి చెందిన సంఘటన కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన మల్లికార్జున స్వామి అనే రైతు బుధవారం సాయంత్రం ఒక్క సారిగా చాతిలో నొప్పి రావడంతో కింద కుప్పకూలారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి గుండెపోటుతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. ఆయన మృతికి గ్రామస్తులు సంతాపం తెలిపారు