'ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరం'
VZM: రహదారి ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని గజపతినగరం CI GAV రమణ అన్నారు. శుక్రవారం బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోగల ముఖ్యమైన కూడలిలో జాతీయ రహదారిపై స్టాపర్లను టైర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. నిబంధనలను పాటించినప్పుడే ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు.