కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి

కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి

SRD: జోగిపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ జోగినాథ స్వామి ఆలయ రథోత్సవం, శివపార్వతుల కల్యాణోత్సవంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఇవాళ తన సొంత నియోజకవర్గమైన ఆందోల్‌లో పర్యటించిన మంత్రి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జోగిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక నేతలతో భేటీ అయ్యారు.