మరోసారి చిక్కుల్లో పడ్డ ఆర్యన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. బెంగళూరులోని ఓ పబ్ ఈవెంట్‌లో ఆర్యన్ మిడిల్ ఫింగర్ చూపించాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడ చాలామంది మహిళలు ఉన్నారని, ఆర్యన్ అలా చేయడం వారి పట్ల అగౌరవంగా, అమర్యాదగా ఉందని తెలిపాడు. దీనిపై పోలీసులు సుమోటో విచారణ చేపట్టారు. విచారణ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.