ఎంపీటీసీగా గెలిచినందుకు సిగ్గుపడుతున్నాం

NLR: తమను ఎంపీటీసీగా గెలిచినందుకు సిగ్గుపడుతున్నామని పెనుబల్లి ఎంపీటీసీ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చిలో మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమకు సమాచారం ఇవ్వకుండానే గ్రామాలలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపీటీసీలు కూడా ప్రజా ప్రతినిధులు అని గుర్తించాలని కోరారు. అభివృద్ధిలో తమను కూడ భాగస్వాములను చేసుకోవాలని అన్నారు.