VIDEO: సమ్మక్క–సారలమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభం
HNK: ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర అట్టహాసంగా నేడు ప్రారంభమైంది. గుండ్లపల్లి సాంబశివరావు ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పసుపు–కుంకుమలను భారీ ఊరేగింపుగా గద్దెలపైకి చేర్చారు. జాతర ప్రాంగణం శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో మారుమోగుతోంది. సాయంత్రం గోనెల వెంకన్న ఇంటి నుంచి సారలమ్మను గద్దెపైకి ప్రతిష్ఠించనున్నారు.