ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. స్త్రీ శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలకంగా మారుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి బస్సు డిపోలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఇది అమలు కావాలని అధికారులను ఆదేశించారు.