పాక్ రేంజర్‌ను పట్టుకున్న జవాన్లు

రాజస్థాన్ శ్రీ గంగానగర్ బార్డర్ వద్ద పాకిస్తాన్‌కు చెందిన ఓ రేంజర్‌ను BSF జవాన్లు పట్టుకున్నారు. వెంటనే అతడిని ఆర్మీ అధికారులకు అప్పగించారు. పహల్గామ్ దాడి తర్వాత సరిహద్దు వద్ద పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ తరుణంలో నియంత్రణరేఖ వద్ద గీత దాటిన రేంజర్‌ను జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు భారత్‌లోకి ప్రవేశించాడన్న కోణంలో అతడిని విచారిస్తున్నారు.