పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ రాక

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ రాక

SKLM: నరసన్నపేటలో శనివారం ఎంఆర్సీ కార్యాలయానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాలు వచ్చాయి. ఒక ప్రైవేట్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ 'ఆల్ ఇన్ వన్' స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నట్లు ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలి నాయుడు తెలిపారు. త్వరలోనే ఈ పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తామని వారు వివరించారు.