VIDEO: జిల్లాలో కొత్త మద్యం పాలసీ ప్రారంభం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో నూతనంగా కేటాయించిన దుకాణాలకు స్టాక్ చేరింది. పాత పాలసీ గడువు ముగియడంతో నేటి నుంచి విక్రయాలు కొత్త నిబంధనల ప్రకారం ప్రారంభమయ్యాయి. కొత్తకోట, తిమ్మాజీపేట గోదాముల్లో రూ.300 కోట్ల విలువైన మద్యం నిల్వ ఉందని అధికారులు తెలిపారు. దుకాణదారులు నిన్న రాత్రి నుంచే స్టాక్ తరలింపులో నిమగ్నమయ్యారు.