అక్టోబర్ 3 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు

NLG: ధర్వేశిపురం స్టేజి వద్ద గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి జయరామయ్య ఆదివారం తెలిపారు. భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. అలాగే ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు.