రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రేమ, దయ, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దీంతో సమాజంలో శాంతి, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.