'సాక్షుల హాజరు, వారెంట్ల అమలులో జాప్యం వద్దు'
అన్నమయ్య: మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ కోర్టు కానిస్టేబుళ్లు, మానిటరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సాక్షులను సకాలంలో హాజరుపరచడం, వారెంట్లను వేగంగా అమలు చేయడం, తీవ్రమైన కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బాధితులకు త్వరిత న్యాయం అందేలా పనిచేయాలని సూచించారు.