పోస్టుపై భిన్నాభిప్రాయాలు.. స్పందించిన ఉపాసన
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల IIT HYD విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పెళ్లిపై చేసిన కామెంట్స్‌కు నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఉపాసన తాజాగా స్పందించారు. తన పోస్టుపై ఆరోగ్యకరమైన చర్చ జరగినందుకు సంతోషంగా ఉందంటూ ఆమె మరో పోస్టు పెట్టారు. మరింత మంది మహిళలు ఉద్యోగాలు చేసేలా మనందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.