ఈనెల 26న శ్రీకన్యక పరమేశ్వరి జయంతి వేడుకలు
NZB: వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంతో ఆర్యవైశ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26న శ్రీకన్యక పరమేశ్వరి జయంతి వేడుకలకు జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పండగకు ముందు ప్రకటన రావడంతో ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్యులకు ఈ గౌరవం దక్కిందని వారన్నారు.