'చిన్నారులకు స్నేహపూర్వక విద్యా బోధన చేయాలి'

CTR: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు స్నేహపూర్వక విద్యా బోధన చేయాలని జిల్లా SSA-PO వెంకటరమణ సూచించారు. పుంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీలకు 'జ్ఞాన జ్యోతి' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శిక్షణ తరగతులను మంగళవారం ఆయన సందర్శించారు. విద్యా బోధనపై అంగన్వాడీలకు తగు సూచనలు చేశారు.