అనంతపురంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం

ATP: ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని నలందా జూనియర్ కాలేజ్‌లో డ్రగ్స్‌పై ఈగల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. వాటి దుష్ప్రభావాలను వివరించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.