పాతమల్లంపేటలో రైతులకు యూరియా పంపిణీ

పాతమల్లంపేటలో రైతులకు యూరియా పంపిణీ

AKP: గొలుగొండ మండలం పాతమల్లంపేట పంచాయతీలో సర్పంచ్ గెడ్డం ఆదిలక్ష్మీ శుక్రవారం రైతులకు యూరియాను పంపిణీ చేశారు. రైతులకు ఎరువుల కొరత లేదని, అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కే.సుధారాణి, టీడీపీ నాయకులు గెడ్డం నానాజీ పాల్గొన్నారు.