పుత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

పుత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

TPT: పుత్తూరు పట్టణ సమీపంలోని పరమేశ్వర మంగళం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. శ్రీకాళహస్తి నుంచి కంచికి వెళ్తున్న కారు.. చెన్నై నుంచి తిరుపతికి వెళ్తున్న తమిళనాడు RTC బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పన్నీర్ సెల్వం, లక్ష్మీ, రవి రాహుల్, మలర్వీయి, కుమార్ గాయపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.