అగ్నిప్రమాదం.. గోవాలో బాణాసంచా నిషేధం!
న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలకు గోవా సన్నద్ధమవుతున్న వేళ అక్కడి అధికారులు బాణాసంచాపై నిషేధం విధించారు. నైట్ క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన నేపథ్యంలో.. నైట్ క్లబ్ & బార్స్, రెస్టారెంట్ & హోటల్స్, రిసార్ట్స్, బీచ్‌ల్లో బాణాసంచాను పూర్తిగా నిషేధిస్తూ నార్త్ గోవా జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.