పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి: కలెక్టర్

ASF: పండుగలను ప్రజలందరూ సమన్వయంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ కాంతిలాల్ సుభాష్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అదనపు ఎస్పీలతో కలిసి గణపతి నవరాత్రులు, మిలాద్ ఉన్ నబి వేడుకల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, శాఖల అధికారులతో శాంతి కమిటి సమావేశం నిర్వహించారు.