సర్పంచ్ పదవులకు 46 నామినేషన్లు దాఖలు

సర్పంచ్ పదవులకు 46 నామినేషన్లు దాఖలు

GDWL: మల్దకల్ మండలం వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే సర్పంచ్ పదవులకు 46 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి తెలిపారు. అత్యధికంగా మేకలసోంపల్లి గ్రామం నుంచి ఏడు నామినేషన్లు వచ్చాయన్నారు. ఆదివారం నుంచి ఇప్పటివరకు మండలంలో మొత్తం 68 మంది అభ్యర్థులు సర్పంచ్‌లకు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్, వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు చేయడానికి రేపే చివరి రోజు.