ఉపాధి హామీ పనులను పరిశీలించిన గ్రామ సర్పంచ్
NGKL: అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో బీడు భూమి అభివృద్ధి పనులను సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి పరిశీలించారు. గ్రామంలోని ఉపాధి పనుల పని ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి కొలతల ప్రకారం పనులు చేయాలని టెక్నికల్ అసిస్టెంట్ సరిత కూలీలకు అవగాహన కల్పించారు.