స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్రలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్సీ

E.G: ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ శుద్ధి, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఈ విశిష్ట కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గర్వకారణం అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమండ్రిలోని కంబాల చెరువు పార్కులో దోమల నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని కలెక్టర్ పి. ప్రశాంతితో కలిసి ప్రారంభించారు.