అక్రమ ఇసుక రవాణా పై కఠిన చర్యలు: హరి ప్రసాద్

అక్రమ ఇసుక రవాణా పై కఠిన చర్యలు: హరి ప్రసాద్

WNP: ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్ హెచ్చరించారు. గురువారం రాత్రి వనపర్తిలో బీట్ డ్యూటీలో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా బాలనగర్ కరెంట్ ఆఫీస్ దగ్గర అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.