సీపీఐ వార్డు సభ్యుడికి నేతల సన్మానం
NLG: చిట్యాల మండలం ఎలికట్టె గ్రామంలో సీపీఐ నుండి వార్డు సభ్యుడిగా గెలుపొందిన ఎండీ జహంగీర్ ను చిట్యాల, నార్కట్పల్లికి చెందిన ఆ పార్టీ నేతలు శనివారం సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్.కే షరీఫ్, నార్కట్ పల్లి మండల నాయకులు ఎస్.కె నజీర్, పసుల దేవేందర్ పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.