లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
TPT: సూళ్లూరుపేటలో శనివారం 84 మంది లబ్ధిదారులకు రూ. 79,31,605 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 230 మందికి రూ. 2.88 కోట్లకు పైగా సహాయం అందిందని ఆమె తెలిపారు. ప్రజలకు వైద్య ఖర్చు భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.