'కిరాణా షాపుల్లో ప్లాస్టిక్ విక్రయించే వారిపై కొరడా'

బాపట్ల: పురపాలక సంఘం కమీషనర్ ఛాంబర్ నందు బాపట్ల కిరాణా మరియు రిటైల్ మర్చంట్ అసోసియేషన్ వారితో మున్సిపల్ కమీషనర్ జి.రఘునాథ రెడ్డి పట్టణంలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం పై సమావేశం నిర్వహించారు. పట్టణంలో యధేచ్చగా వినియోగంలో ఉన్న ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధిస్తున్నామని కమిషనర్ అన్నారు. ప్లాస్టిక్ అమ్మేవారికి వారం రోజులు గడువిస్తున్నామన్నారు.