'ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి'

'ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి'

WGL: సంగెం మండలం ఆశాలపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. పనుల పురోగతిని వివరంగా తెలుసుకుని, నాణ్యతను కాపాడుతూ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.